Kavithalu - Are Nestama

Share by Facebook Share by Email


Name: vijaya alluri

Published Date: 29-11-2015


-- అరే నేస్తమా! ఎన్నాళ్ళయింది
 

నా కవితా పొలంలో అడుగిడక ..........
నా మది సాహితీ సేద్యం చేయక.......

నా ఆలొచనా పిల్లకాలువ ప్రవాహన్ని
ఈ పొలానికి మరల్చక.............

గత జ్ఞాపకాల మట్టి సువాసనలను .....
రేపటి ఆశల మధుర ఫలాలను...
మెడలో గంటలుగా మార్చుకున్న
నా వర్ణన ,ఊహా గానుగెద్దులను గాంచక......
.
నేటి నా  శ్రమజీవన నాగలిని చేర్చి
ఈ త్రి సమూహ సమన్వయంతో
నా పదముల కరములు ఈ నేలను దున్నక.....
 
సారవంతమైన కవుల మెధొపొలం నుండి సేకరించిన
 భాషా పరిజ్ఞాన విత్తులను ఇందు చల్లక..... 

నాలోని భావాల తపనను
ఈ పొలానికి ఎరువుగా వేయక........       
                                           
నా కవితా పొలంలో అడుగిడక ..........
నా మది సాహితీ సేద్యం చేయక.......

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.