సాయంత్రపు చల్లగాలి నిన్ను తాకువేల,
బాదెందుకు మనసా..అది నీకైనా తెలుసా...
పక్షులన్ని దరికిచేరి నిను పలకరించు వేల,
పలకవేల మనసా.. పక్షులంటె అలుసా...
రవి సైతం చల్లబడి నిను ప్రశ్నించిన వేల,
బదులివ్వవేల మనసా..నీ మాటతీరు గడుసా...
ఒక్కటిగా చుక్కలన్ని చేరువైన వేల,
చూడవేల మనసా.. నీ మనసు అంత బిగుసా...
నీది కానిదానిపైన ఆశందుకు మనసా...నా అందమైన మనసా...
నిను చేరలేని దానిపైన అలకెందుకు మనసా...ఓ పిచ్చిదైన మనసా...
గతమంతా గాలించి బాదపడకె మనసా...నా బారమైన మనసా...
గాయాలను గానాలుగ పాడుకోవె మనసా...ఓ ఒంటరైన మనసా...
నీదికానిదేదీ నిన్ను చేర రాదు,
నీదిఅయినదేదీ నిన్ను వీడిపోదు...
ఈ నిజమును తెలుసుకొని నడుచుకోవె మనసా..నిను మార్చుకోవె మనసా...
ఆశలలో పరుగులేసి ఓడిపోకు మనసా..నువు గెలవగలవె మనసా...
జీవితమనే ఆటలో అలసిపోకె మనసా..నువు ఆడగలవె మనసా...
నీ ప్రతికలనీ నిజము చేసి గర్వపడవె మనసా..నీకడ్డులేదె మనసా...
బాదలన్ని ఎంచుకుంటె ప్రతి బతుకూ బారమే...
బారమని ఊరుకుంటె ఆ బతుకు వ్యర్థమే...