జక్కన చెక్కిన శిల్పానివా
జాజి మల్లికి మించిన అందానివా
ఉషోదయపు తుషార బిందువువా ...!
ఎవరివి నీ వెవరివి ...
వసంత కాలపు కోకిల గానానివా
హరివిల్లు లోని సప్త వర్ణాల రంగవల్లివా
పుడమి పులకించే చిరు జల్లు ముత్యానివా ..!!
ఎవరివి నీ వెవరివి ..
శరత్ రుతువు హిమబిందు మెరుపువా
కలువను మించిన కన్నులున్నసోయగానివా
వరూదిని ని మించిన విరహానివా ...!!!
ఎవరివి నీ వెవరివి .....
నా మనసు దోచిన మృదు మంజీర నాదానివా
నా ఎదలో కొలువై వెలుగుతున్న దివ్య దీపానివా
నా హృదయ వీణను మీటిన సప్త స్వరాల సరిగమవా ...!!!!
ఎవరివి నీ వెవరివి .......