వర్షించే కనులను క్షణకాలం స్వేదతీర్చే చిరునవ్వును
కరిగే కలలను కనుపాపల మాటున నిలిపే కనులను
అనునిత్యం అంతర్మధన ఆహ్లదాన్ని బ్రోలే హుదయాన్ని............నేను ప్రేమిస్తున్నాను
ప్రేమకు నిలయమైన వసుధైక కుటుంబ జీవన సౌందయాన్ని
తన చిరకాల వైరి ఓటమికైన చెలించగల మనసును
మైత్రితో జగాన్ని జయించగలమనే నమ్మకాన్ని..........నేను ప్రేమిస్తున్నాను
స్రమైక జీవన సాహచర్యంలో కంధిన ఆ కరములను
విషాధ నిశ్శబ్ధాన్ని చేధించే ఆ అడుగుల సవ్వడిని
అప్తుల ఆనందానికై అలసిసొలసిన తలపులను
ఆ...అడుగో
రాగద్వెషాల కూడలిలో అలుపెరుగక పయనించే
అనురాగమనే భాటసారిని.....................