అడుగడుగున ఒక అందం,
అణువణువున మకరందం..
పట్టలేని ఆప్యాయత,
ప్రతి మనసులోన మమత..
స్వర్గానికి మారుపేరు ఈ భువిన పల్లెటూరు,
ఆనందానికి అసలుపేరు ఈ ఇలన పల్లెటూరు...
ఎటువైపు అడుగువేసినా పచ్చని చిరుతోటలు,
సాయంత్రపు వేలలో చిన్నారుల ఆటలు,
జామ,మాడి తోటలో పండ్లకొరకు వేటలు,
ఊరిబయట ఏటిలో చాకలమ్మ పాటలు...
పరికిణిలో పలకరించు పల్లెటూరి కాంతలు,
మనసొంతమైంది అపహరించి వెక్కిరించు కోతులు,
తెలవారముందె చెవులచేరు కోడిపుంజు కూతలు,
తెలవారినంత లేవగానె లేగదూడ గెంతులు...
ఊయలలా తనను మలచి ఒడ్డుచేర్చు పడవలు,
అవ్వలనే ఆటపట్టి తిట్లు తినే బడవలు,
వంతులకై కొట్టుకునే కాంతామణి కడవలు,
వాదనలో వచ్చిపోవు చిన్నపాటి గొడవలు...
అప్పుడప్పుడొచ్చిపోవు అమ్మవారి మేలలు,
సందడిగా సంబరాలు జరుపుకొనే వేలలు,
జాతరలో జనము మద్య పోకిరోల్ల గోలలు,
పరికిణిలో వచ్చి మరీ పడుచుపిల్ల ఈలలు...
సెలవురోజు సందడిగా సెలయేటిలోన మునకలు,
అమ్మవారి ఆలయాన అమ్మాయిల ముక్కులు,
ఎండకాచు సమయమందు సేదతీర్చు పేకముక్కలు,
ఏ ఇంటికి వెల్లినా పలకరించు పూలమొక్కలు...
తన అరపుతోనె మదినిదోచు చెట్టుపైన చిలకలు,
నడకతోనె తాలమేయు ఎద్దుమెడన గిలకలు,
మనం నాటినట్టి విత్తనం మరునాడువేయు మొలకలు,
పలుకునేర్చుటాలస్యం చిన్నారిచేత పలకలు...
ఏ ఇంటిముందు చూసినా గొబ్బెమ్మల ముగ్గులు,
మన కల్లముందె విచ్చుకొనే మందారపు మొగ్గలు,
చీరకట్టి వయలుపోవు చిన్నారుల సిగ్గులు,
సూర్యదేవుడే వచ్చిమరీ తొలగించివేయు రగ్గులు...
ఈ సుగందాల సంగమం సిసలైన పల్లెటూరు,
ఆప్యాయతానురాగలే ఈ జనం బతుకుతీరు...
Comments